రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని... మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ తెలిపారు. హైదరాబాద్ మోతీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి హ్యాండ్‌లూమ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో పలువురు పాల్గొని చేనేత ఉత్పత్తులను పరిశీలించారు.
కరోనా కారణంగా చేతి వృత్తి కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని... మేళా నిర్వాహకుడు గంగాధర్ అన్నారు. వారికి ఉపాధితో పాటు ఉత్పత్తులకు మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కళాకారులు తయారు చేసిన పలు ఉత్పత్తులు ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి: బయో ఆసియా సదస్సు విజయవంతం: జయేశ్ రంజన్