డిఫెన్స్ కాలేజీ బృంద సభ్యులకు తెలంగాణ పథకాలు వివరిస్తున్న సీఎస్ నేషనల్ డిఫెన్స్ కాలేజీకి చెందిన 16 మంది సభ్యుల బృందం ఎకనమిక్ స్టడీలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని కలిసింది. గత నాలుగున్నరేళ్లుగా తెలంగాణ సాధించిన అభివృద్ధిని సీఎస్ వారికి వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఫార్మా, రక్షణ, ఐటీ రంగాల్లో అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
తెలంగాణ అద్భుత ప్రగతి
తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఫ్యాకల్టీ ఇంఛార్జీ అభయ్ త్రిపాఠి కొనియాడారు. పర్యటనలో టీహబ్, టాటా బోయింగ్ ఏరోస్పేస్, జెన్ టెక్నాలజీస్, హనీవెల్ టెక్నాలజీస్ ను సందర్శించనున్నట్లు బృంద సభ్యులు పేర్కొన్నారు. ఈనెల 4 నుంచి 8 వరకు రాష్ట్రంలో బృందం పర్యటిస్తుంది.
ఇవీ చూడండి :నిజామాబాద్లో అమిత్ షా