narayana bail cancel : నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణకు చిత్తూరు తొమ్మిదో అదనపు కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బెయిల్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 30లోపు పోలీసులు ఎదుట లొంగిపోవాలని తీర్పునిచ్చింది. గతంలో ఈకేసుకు సంబంధించి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు బెయిల్ మంజూరైంది.
అయితే బెయిలివ్వడం సమంజసం కాదని.. రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై చిత్తూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నారాయణ బెయిల్ రద్దు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.