Tarakaratna Met Nara Lokesh : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో నందమూరి తారకరత్న భేటీ అయ్యారు. ఈ నెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర చేస్తున్నందున హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు కాసేపు చర్చించారు. తారకరత్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడతారని గత కొంతకాలంగా వస్తున్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఇప్పటికే ఏపీలో జీవో నెంబర్ 1 అమలు ఉన్న నేపథ్యంలో ఈ నెల 27న లోకేశ్ పాదయాత్ర మీద.. ప్రభుత్వం చేపట్టబోయే చర్యలపై ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు సభలు, రోడ్డు షోలకు వైసీపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీలపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ ఇటీవల చంద్రబాబును కలిసి పలు అంశాలపై చర్చించారు. తాజాగా నందమూరి తారకరత్న నారా లోకేశ్‌తో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఇవీ చదవండి:
చంద్రబాబుతో గడిపిన సమయం ఎంతో విలువైనది: సూపర్‌స్టార్ రజినీకాంత్