Balakrishna on Childhood Cancer Day: అవసరమైన వారికి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని ప్రముఖ సినీనటుడు, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డేని పురస్కరించుకుని బసవతారకం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రిలో చిన్నపిల్లల డే కేర్ యూనిట్‌ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు సహా ఆసుపత్రి సిబ్బంది, క్యాన్సర్ బాధితుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్‌తో కలిసి సర్వైకల్ క్యాన్సర్ నివారణలో భాగంగా 9 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న బాలికలు, యువతులకు బసవతారకం ఆసుపత్రిలో హెచ్‌పీవీ (HPV) టీకాలు పంపిణీ చేయనున్నట్టు బాలకృష్ణ తెలిపారు. బసవతారకం ఆసుపత్రిలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉందని చెప్పిన ఆయన... ఆసుపత్రిలో జెనెటిక్ క్లినిక్‌లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. జెనెటిక్ టెస్టింగ్ ద్వారా క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించవచ్చని బాలకృష్ణ సూచించారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారన్న ఆయన... పిల్లల్లో క్యాన్సర్‌ను గుర్తించటం తల్లిదండ్రుల బాధ్యతగా పేర్కొన్నారు.
బసవతారకం ఆస్పత్రిలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉంది. ఆసుపత్రిలో జెనెటిక్ క్లినిక్‌లు ఉన్నాయి. అవసరమైన వారికి ఉచిత చికిత్స అందిస్తాం. జెనెటిక్ టెస్టింగ్ ద్వారా క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించవచ్చు. ఈ సంవత్సరం సర్వైవబుల్ అండ్ ఎచీవబుల్ అనే థీమ్‌తో జరుపుకుంటున్నాం. చిన్న పిల్లల క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో మేం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. వారికి చికిత్స అందించడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే చిన్నపిల్లల విభాగంపై ప్రత్యేక దృష్టి సారించాం.
-- నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్
ఇదీ చదవండి: కల్వకుంట్ల రాజ్యాంగం అమలైతే రిజర్వేషన్లు రద్దు ఖాయం: బండి సంజయ్