కాలినడకన వెళ్తోన్న గర్భిణీ పట్ల ఓ ట్రాఫిక్ సీఐ మానవత్వం చాటుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో రవాణా సౌకర్యం లేక నడుస్తూ వెళుతున్న అనిత అనే గర్భిణీని పోలీస్ వాహనంలో ఇంటికి చేర్చారు.
అనిత నాంపల్లి నుంచి మెహదీపట్నం వైపుగా వెళ్తోంది. గర్భిణీ కావడంతో నడిచేందుకు అవస్థ పడుతోంది. ఇది గమనించిన నాంపల్లి కంట్రోల్ రూమ్‌లో ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వర్తించే మల్లేశ్.. పోలీస్ వాహనంలో అనితను ఇంటి వద్ద దిగబెట్టారు. గర్భిణీ పట్ల మానవత్వం చూపిన సీఐని పలువురు అభినందించారు.