కరోనా మహమ్మారి నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు వైద్యసిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించారని ముత్తూట్ గ్రూప్ స్వతంత్ర డైరెక్టర్ థామస్ జాన్ అన్నారు. కొవిడ్ కష్టకాలంలో వారు చేసిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ సహకారంతో... ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో కోఠి లోని ఐఎంఏ హాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కొవిడ్ -19 కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్న ఆరోగ్య సంరక్షణ నిపుణులను గౌరవించేందుకు సెల్యూట్ టు కొవిడ్ -19 వారియర్స్ ప్రాజెక్టును ముత్తూట్ ఫైనాన్స్ ప్రారంభించిందని థామస్ జాన్ తెలిపారు. ఈ సందర్భంగా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవచేసిన 38 మందిని ఆయన ముత్తూట్ గ్రూప్ సెల్యూట్ కొవిడ్ -19 వారియర్స్ అవార్డు, సర్టిఫికెట్, నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.
ఇదీ చదవండి: 'భాగ్యనగరం.. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం'