కరోనా వైరస్ నిర్మూలనకు హైదరాబాద్ పాతబస్తీ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కరోనా వైరస్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలంటూ మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో పాటల రూపంలో వివరించారు.వైరస్ సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
ఠాణా పరిధిలోని వీధులన్నీ తిరుగుతూ అవగాహన కల్పించారు. ప్రజలు కూడా వీరి సూచనలు పాటిస్తూ ఇళ్లకే పరిమితమవ్వాలని కోరారు. ప్రతి నిత్యం ప్రజా శ్రేయస్సు కోసమే కష్టపడుతున్న తమ శ్రమను గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణకు పోలీస్ శాఖ ఇస్తోన్న సూచనలు పాటించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.