భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగిన హెచ్‌ఐసీసీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు యత్నించారు. బ్యానర్లు పట్టుకుని ఒక్కసారిగా మాదాపూర్ హైటెక్స్ ముఖద్వారం వద్దకు దూసుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం తేవాలంటూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. కార్యకర్తలను అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే ఈ నిరసనలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ స్పందించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా ఎస్సీ వర్గీకరణను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకే నిరసనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పార్లమెంటులో భాజపా ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడితే.. సులభంగా ఆమోదం పొందుతుందని మందకృష్ణ పేర్కొన్నారు. 1996లో తిరుపతిలో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఎన్నికల ప్రణాళికలో ప్రకటిస్తున్నా.. పరిష్కారం చూపడం లేదని ఆరోపించారు. పరిష్కారంలో జాప్యానికి కారణాలేంటని ఆయన ప్రశ్నించారు. ఈ పోరాటంలో ఉన్న ధర్మం, మాదిగల నిజాయతీని అర్థం చేసుకోవాలన్నారు. బీసీలో ఏబీసీడీ తరహాలో మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ చేపట్టాలన్నది తమ డిమాండ్ అని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా ఎస్సీ వర్గీకరణను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకే నిరసనలు చేపట్టాం. పార్లమెంటులో భాజపా ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడితే సులభంగా ఆమోదం పొందుతుంది. 1996లో తిరుపతిలో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసింది. ప్రతి ఎన్నికల ప్రణాళికలో ప్రకటిస్తున్నా పరిష్కారం చూపడం లేదు. అసలు పరిష్కారంలో జాప్యానికి కారణాలేంటి. ఈ పోరాటంలో ఉన్న ధర్మం, మాదిగల నిజాయతీ అర్థం చేసుకోవాలి. బీసీలో ఏబీసీడీ తరహాలో మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ చేపట్టాలన్నది మా డిమాండ్.-మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు
అంతకుముందు ప్రధాని మాటలు నీటి మీద మూటలేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. అలాంటి ప్రధాని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా రాష్ట్ర ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పార్సీగుట్ట నుంచి ఇందిరాపార్కు వరకు ప్రదర్శనగా వెళ్లారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ అంశంపై రూట్‌మ్యాప్ ప్రకటించాలని కోరినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణకే కట్టుబడి ఉన్నామని పదేపదే చెబుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ప్రధాని అపాయింట్మెంట్ అడిగితే కల్పించడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు.
ఇవీ చూడండి..
సీఎం ఇంట్లోకి ఆగంతుకుడు.. అర్ధరాత్రి గోడ ఎక్కి.. రాత్రంతా...
Mayor joins congress: తెరాసకు మరో షాక్.. హస్తం గూటికి మేయర్..!