ఆంధ్రప్రదేశ్ కుప్పకూలే పరిస్థితి ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీ రాజధాని పరిణామాలపై తెలంగాణ వాడిగా సంతోషంగా ఉందని అన్నారు. భారతీయ పౌరుడిగా బాధగా ఉందని పేర్కొన్నారు. ఏపీ పరిణామాల వల్ల హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం పెరిగిందని వెల్లడించారు.
రాష్ట్రానికి స్థిరాస్తి వ్యాపార రంగం ఆదాయం పెరిగిందని... ఏపీ కుప్పకూలే పరిస్థితి వల్ల తెలంగాణకే లాభమని అన్నారు. ఇక్కడి ఓ స్థిరాస్తి వ్యాపారికి మేలు చేసేందుకే ఏపీలో గందరగోళం సృష్టించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇదీ చూడండి: ట్రా'ఫికర్': పంతంగిలో కిలోమీటరు మేర స్తంభించిన వాహనాలు