చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. భూమి శిస్తు, పన్నుల విషయంలో పటేల్, పట్వారీలను వ్యతిరేకించిన చాకలి ఐలమ్మ.. అంతటి యోధురాలి విగ్రహం ఇంతవరకు సీఎం కేసీఆర్ ట్యాంక్‌బండ్‌పైన ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో లోయర్ ట్యాంక్‌బండ్ పరిధిలోని ఎల్చగూడలో తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన చాకలి ఐలమ్మ 127వ జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఆయన నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితలకు, గిరిజనులకు దళిత, గిరిజన బంధు ఏర్పాటు చేసినట్లే రజకులకు కూడా రజకబంధు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రజక బంధు ప్రకటించిన తర్వాతే తెరాస మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాలని ఆయన సూచించారు.
ఇవీ చదవండి: