వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంపై, ఎంపీ ధర్మపురి అర్వింద్, పార్టీ నేతలపై తెరాస నేతల దాడికి పోలీసులు సహకరించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత సెగ తాకకుండా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద మాత్రమే పోలీసులు కాపలా కాస్తున్నారని మండిపడ్డారు.
వరంగల్ భాజపా కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడి జరుగుతున్న సమయంలో దాడిని నిలువరించని, ఎంపీకి భద్రత కల్పించని పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కార్యాలయాలు, ఇళ్ల ముందు భయంతో పహారా కాస్తున్న పోలీసులకు భాజపా కార్యాలయం, ఎంపీ అర్వింద్‌పై దాడి జరుగుతున్న సమయంలో విధులు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.