గుల్బర్గాకు వాయవ్యదిశలో 80 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని తెలిపింది.
రాష్ట్రంలో ఇవాళ కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.
ఇవీచూడండి: హైదరాబాద్‌లో నిలిచిన విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు