MLC Kavitha : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తిరుమలలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతికి చేరుకున్న ఆమెకు... అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అలిపిరిలోని శ్రీవారిపాదాల మండపం, సప్త గో ప్రదక్షిణశాల, శ్రీలక్షీ నారాయణ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సప్త గో ప్రదక్షిణశాల వద్ద మొక్క నాటారు.
దేశానికి సంబంధించి సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాల్సిన అవసరముందని... ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. చర్చ జరిగినప్పుడే అనేక అంశాలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరగడం ఆనందంగా ఉందన్న కవిత... 105 స్థానాల్లో డిపాజిట్ రాని భాజపా తెరాసపై దుష్ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. కాలినడకన తిరుమల చేరుకున్న కవిత... రేపు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొంటారు.
భారత దేశ పౌరుడిగా దేశంలో జరుగుతున్న పరిణామాలపైన, రాజకీయాలపైన ఇక్కడి జరుగుతున్న అనేక అంశాలపైన ఎవరిమైనా స్పందిచవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్.. చెప్పింది కూడా అదే. భారత దేశ పౌరుడిగా స్పందిస్తానని చెప్పారు. వారికి అభ్యంతరం ఉన్న అంశాలను వారు లేవనెత్తడం జరిగింది. వాటిమీద దేశవ్యాప్తంగా రాజకీయపరమైన చర్చ జరగాలని చెప్పి.. మనమందరం కూడా ఆశించాలి. ఎప్పుడైతే చర్చ జరుగుతుందో అప్పుడే ఓ గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే దిశగా.. సమాజం ముందుకెళ్తుంది. భాజపాకు పోయినసారి ఎన్నికల్లో దాదాపు 107 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు. అటువంటి పార్టీ కూడా మా మీద మాట్లాడుతుంటే ఏమి చెప్పాలి.
- కల్వకుంట్ల కవిత, తెరాస ఎమ్మెల్సీ
ఇదీ చూడండి : KCR Birthday: కడియం నర్సరీలో కేసీఆర్కు వినూత్నంగా శుభాకాంక్షలు