ETV Bharat / state

సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడే... కానీ అదొక్కటే నెగిటివ్: జీవన్​రెడ్డి

ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి. సీఎం పదవికి మంత్రి కేటీఆర్ సమర్థుడేనని... కానీ ఆయనకో నెగిటివ్ పాయింట్ ఉందన్నారు. ఈటల రాజేందర్​ను సీఎం చేస్తే అందరూ ఏకాభిప్రాయంతో ఆమోదిస్తారని జీవన్​రెడ్డి అన్నారు.

సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడే... కానీ అదొక్కటే నెగెటివ్: జీవన్​రెడ్డి

author img

By

Published : Feb 4, 2021, 6:56 PM IST

సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడే... కానీ అదొక్కటే నెగిటివ్: జీవన్​రెడ్డి

కేసీఆర్... జాతీయ రాజకీయాల వైపు వెళితే కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉండొచ్చునని జీవన్​రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ సీఎం అయ్యేందుకు సమర్థుడే అయినప్పటికీ... వారసత్వం అనే ముద్ర ఉందన్నారు. సీఎంగా కేటీఆర్‌కు బదులు ఈటల రాజేందర్‌ను చేస్తే పార్టీలో ఎవరూ వ్యతిరేకించరని జీవన్ రెడ్డి వివరించారు.

నిజంగానే కేసీఆర్... భాజపాకు, కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్​ ఏర్పాటు చేయాలని భావించి... జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్లదలుచుకుంటే... ఇక్కడ మీరు ప్రత్యామ్నాయం గురించే ఆలోచిస్తే... కేటీఆర్ సమర్థుడే కావొచ్చుగాక. కానీ కేటీఆర్​కు ఒక నెగిటివ్ పాయింట్ ఉంది. కేటీఆర్​పై ఓ విమర్శ ఉంది. ఏంటంటే వారసత్వం. దీనికి తావు ఇవ్వకుండా ఉండాలంటే... ఉద్యమం ఆరంభం నుంచి ఉండి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఈటల రాజేందర్​కు అవకాశం కల్పిస్తే అందరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తారనుకుంటున్నా.

--- జీవన్​రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి... కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు ఉద్యమిస్తున్నా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పటికైనా కేంద్రంపై నెట్టకుండా మద్దతు ధరతో పసుపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

గెలిచిన వంద రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ధర్మపురి అర్వింద్ వాగ్ధానం చేశారని ఇప్పటి వరకు ఆ ఊసేలేదన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలను అభినందిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: తెలంగాణ వార్షిక బడ్జెట్​లో నిరుద్యోగ భృతి అంశం..
!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.