MLAs Wishes to CM KCR at Assembly Sessions : రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కార్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు వెల్లువెత్తాయి. శాసనసభ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను ఛాంబర్‌లో కలిసి... రైతు, ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ధ్యనవాదాలు తెలిపారు. ఇటీవల కేబినెట్‌లో తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, బుధవారం తీసుకున్న రుణమాఫీ నిర్ణయానికి కృతజ్జతాభివందనాలు తెలిపారు. దాంతో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సందడి నెలకొంది.
Ministers Wishes to CM KCR : రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్చాలు అందించారు. తమ రైతుల తరఫున ప్రజల పక్షాన సీఎం ధన్యవాదాలు తెలిపారు. రైతు రుణమాఫీతో పాటు హైద్రాబాద్లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్దీకరణ నిర్ణయం, తదితర అభివృద్ది సంక్షేమ నిర్ణయాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్జతాభినందనలు వెల్లువెత్తాయి. రుణమాఫీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎంకు పూలబొకే అందించారు. రైతు కుటుంబాలన్నీ సంబరాలు జరుపుకుంటున్నాయని వివరించారు. వ్యవసాయ రైతు పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని.. రైతు బాంధవుడుగా సీఎం కేసీఆర్ మరోసారి నిలిచారని కొనియాడారు. ఆయా జిల్లాల మంత్రుల ఆధ్యర్యంలో ఆ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు : ఆదిలాబాద్‌లో రైతులు, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మంచిర్యాలలోని పలు వీధుల గుండా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు ట్రాక్టర్‌లతో ర్యాలీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో సీఎం కేసీఆర్, మంత్రి చిత్రపటాలను డప్పు దరువుల మధ్య ఆటపాటలతో ఊరేగించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో.. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
రైతులను ఆదుకుంటున్న ఏకైక సర్కార్ బీఆర్ఎస్ : యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ చిత్రపటంతో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు.. తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి.. వైకుంఠ ద్వారం వద్ద పాలాభిషేకం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్ కూడలిలో... కేసీఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేసి.. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా.. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తూ రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారేనని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. జనగామలో రైతు రుణ మాఫీ సంబరాల్లో.. ఎమ్మెల్యే పాల్గొని సందడి చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించటం, రైతు రుణ మాఫీ ప్రకటనలతో... బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి.
ఇవీ చదవండి :