ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులను ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కలిసే హక్కు లేదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మంత్రుల నివాసంలో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డితో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కలిసి రైతుబంధు పథకం, రైతాంగ సమస్యలపై మాట్లాడారు. అక్కడ నుంచి తిరిగి వస్తూ సచివాలయం వెళ్లే అవకాశం ఉందని భావించిన పోలీసులు రవీంద్ర భారతి కూడలి వద్ద శ్రీధర్‌బాబును అడ్డుకున్నారు.
నిరసన..
పోలీసుల చర్యను తీవ్రంగా నిరసిస్తూ ఆయన అక్కడే ఫుట్‌పాత్‌పైనే బైఠాయించారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తమ హక్కు అని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. నిబంధనల పేరుతో నాయకులను గృహనిర్బంధం చేయడమేంటని ప్రశ్నించారు. లాక్డౌన్ సమయం మొత్తానికి విద్యుత్తు బిల్లులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి : 'విద్యుత్ ఛార్జీల మోతపై 15న భాజపా నిరసనలు'