ETV Bharat / state

హైదరాబాద్​లో క్రైం తగ్గిందనడం హాస్యాస్పదం: రాజాసింగ్​ - హైదరాబాద్​లో క్రైం తగ్గిందనడం హాస్యాస్పదం: రాజాసింగ్​

నేరాలను నియంత్రించడంలో భాగ్యనగర పోలీసులు విఫలమయ్యారని ఎమ్మెల్యే రాజాసింగ్​ మండిపడ్డారు. గడిచిన 20 రోజుల్లోనే 6 హత్యలు జరిగినట్లు గుర్తుచేశారు. ఈ 6 నెలల్లో దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు ఎన్ని జరిగాయో చెప్పాలని సీపీ అంజనీకుమార్​ను ప్రశ్నించారు.

mla rajasingh said Crime Reduction in Hyderabad is Ridiculous
హైదరాబాద్​లో క్రైం తగ్గిందనడం హాస్యాస్పదం: రాజాసింగ్​
author img

By

Published : Jul 9, 2020, 10:53 AM IST

నగరంలో ఈ 6 నెలల్లో క్రైమ్ రేట్ తగ్గిందని హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ అంజనీకుమార్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. గత 20 రోజుల్లోనే 6 హత్యలు జరిగాయని సీపీకి గుర్తుచేశారు.

క్రైమ్​ను నియంత్రించడంలో హైదరాబాద్ పోలీసులు విఫలమయ్యారని రాజాసింగ్​ మండిపడ్డారు. ఈ 6 నెలల్లో దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు ఎన్ని జరిగాయో చెప్పాలని అంజనీకుమార్​ను ప్రశ్నించారు. నగరంలో ఎక్కడ చూసినా దొంగతనాలు, హత్యలు జరుగుతున్నాయన్న ఆయన.. క్రైమ్ రేట్ తగ్గినట్లు స్టేట్​మెంట్లు పోలీస్ కమిషనర్ ఇస్తున్నారా..? లేదంటే పెద్దలు ఎవరైనా అలా చెప్పమని చెప్తున్నారా అర్థం కావడం లేదన్నారు.

హైదరాబాద్​లో క్రైం తగ్గిందనడం హాస్యాస్పదం: రాజాసింగ్​

ఇదీచూడండి: ప్రగతిభవన్‌ ముందు హల్​చల్​ చేసిన యువకుడి అరెస్ట్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.