ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాల తొలగింపును అగ్ర కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ అందరివాడని స్పష్టం చేసిన బాలకృష్ణ... ఆ మహనీయుడు ఒక కులానికో, మతానికో లేదా ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్నది ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు.
తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. విగ్రహాల తొలగింపు సందర్భంగా నిరసన తెలిపేందుకు యత్నించిన జీ.వీ.ఆంజనేయులు, ఇతర నేతల గృహ నిర్బంధాన్ని బాలకృష్ణ ఖండించారు. వెంటనే తొలగించిన స్థలంలోనే విగ్రహం ప్రతిష్టించేలా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు ఏమీ చేయలేవన్న బాలకృష్ణ... పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం