ETV Bharat / state

ముస్లిం సోదరులకు బక్రీద్​ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే - musheerabad news

హైదరాబాద్​ జిల్లా ముషీరాబాద్ నియోజకవర్గంలోని మసీదుల్లో ముస్లిం సోదరులు కరోనా నియమాలను పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వీరికి ఎమ్మెల్యే ముఠా గోపాల్​ బక్రీద్​ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని ఉత్సవాలను సమైక్యంగా నిర్వహించుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

mla muta gopal convey wishes of bakrid to Muslims

author img

By

Published : Aug 1, 2020, 10:44 PM IST

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్ విశిష్ఠతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని భోలక్​పూర్​లోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని ఉత్సవాలను సమైక్యంగా నిర్వహించుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని భోలక్​పూర్, ముషీరాబాద్, రామ్​నగర్, అడిక్మెట్, గాంధీనగర్, కవాడిగూడ ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ ఉత్సవాల సందర్భంగా కరోనా నియమాలను పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు ముఠా జై సింహ, వై శ్రీనివాస్, ముస్లిం నాయకులు జూనైద్ బాగ్దాది, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.