ETV Bharat / state

Mla jeevan reddy comments: 'కేటీఆర్‌ స్పీచ్‌కు ప్రతిపక్షాలు ఉలిక్కిపడుతున్నాయి' - తెలంగాణ వార్తలు

మంత్రి కేటీఆర్ స్పీచ్‌కు ప్రతిపక్షాలు ఆగమాగమవుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Mla jeevan reddy comments) అన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పీఎం మోదీకి(pm modi) లేఖలు రాయాలని.. సీఎం కేసీఆర్‌కు(cm kcr) కాదని సూచించారు. ఫసల్ బీమాను భాజపాపాలిత(bjp) రాష్ట్రాలూ తిరస్కరించాయని పేర్కొన్నారు.

Mla jeevan reddy comments, mla jeevan reddy fires on bjp and congress
భాజపా, కాంగ్రెస్‌పై జీవన్ రెడ్డి విమర్శలు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కామెంట్స్
author img

By

Published : Sep 29, 2021, 4:32 PM IST

Updated : Sep 29, 2021, 5:20 PM IST

రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగాల పురోగతిపై శాసనసభలో మంత్రి కేటీఆర్(minister ktr speech) రెండు గంటలపాటు అనర్గళంగా ఇచ్చిన స్పీచ్‌కు భాజపా(bjp), కాంగ్రెస్‌(congress) ఉలిక్కిపడుతున్నాయని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి(Mla jeevan reddy comments) అన్నారు. కేటీఆర్ ప్రసంగం అనంతరం ప్రతిపక్షాలు ఆగమవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖలు రాయాల్సింది సీఎం కేసీఆర్‌కు(bandi sanjay letter to cm kcr) కాదని... ప్రధాని మోదీకి(pm modi) రాయాలని సూచించారు. ఫసల్‌ బీమాను భాజపాపాలిత రాష్ట్రాలు కూడా తిరస్కరించాయని జీవన్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్‌తోపాటు భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలు దిల్లీకి పాదయాత్ర చేయాలని ఎద్దేవా చేశారు. శ్రీకాంతాచారి మరణానికి రేవంత్‌రెడ్డి కారణం కాదా అని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి... హుజూరాబాద్ ఉపఎన్నికకు(huzurabad by elections congress candidate) కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థే లేరని చురకలంటించారు.

రఘునందన్ పరిశ్రమల గురించి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎంపీ కూడా అబద్ధాలే మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు లేఖలు రాస్తూ అబద్ధాలు మాట్లాడుతున్నారు. భాజపా అంటే జలగల పార్టీ. అత్యధిక ట్యాక్సులు, జీఎస్టీలు, పెట్రోల్ బాదుడుతో ప్రతిఒక్కరి రక్తం తాగుతున్నటువంటి పార్టీ. అది జలగల పార్టీ. జలస్ పార్టీ కూడా. మంత్రి కేటీఆర్ రెండు గంటలు కూలంకషంగా మాట్లాడితే జలస్ ఫీల్ అవుతున్నారు. ప్రాంతీయ పార్టీలో ఇంతగొప్పగా తేలిండు... దేశానికే ప్రధాని అవుతాడని జలస్ ఫీల్ అవుతున్న పార్టీ.

-జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే

ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కామెంట్స్

రఘునందన్ ఆరోపణలు

మరోవైపు రాష్ట్రం నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan rao fires on KTR) వెల్లడించారు. హైదరాబాద్‌లో భూరికార్డుల నిర్వహణ సరిగ్గా లేదని, అందుకే తమ పెట్టుబడులను వేరే రాష్ట్రాలకు తరలించుకు వెళ్తున్నామని కంపెనీలు చెప్పాయని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద టెక్నో సిటీ కడతామని టిష్‌మాన్‌ స్పెయర్‌ కంపెనీ ముందుకు వస్తే ప్రభుత్వం సహకరించలేదని రఘునందన్‌రావు విమర్శించారు. 2007లో తెల్లాపూర్‌లో 400 ఎకరాలను బహిరంగ వేలంలో కొనుగోలు చేసిందన్నారు. టిష్‌మాన్ స్పెయర్ కంపెనీ రూ.400 కోట్లు అడ్వాన్స్‌ చెల్లించిందని... 14 ఏళ్లు గడిచినా భూ సమస్యను పరిష్కరించకపోవడంతో రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిందని తెలిపారు. 2014 జూన్ 2 తర్వాత తెరాస సర్కారు ఒప్పందం చేసుకున్న కంపెనీల పేర్లను మంత్రి కేటీఆర్ చెప్పాలని రఘునందన్‌రావు(Raghunandan rao fires on KTR) డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: Huzurabad By Election: ఉపపోరుకు తెరాస, భాజపా వ్యూహాలు.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో?

Last Updated : Sep 29, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.