ETV Bharat / state

భాజపాలో గాడ్సే వారసులే ఉన్నారు: తెరాస - Telangana news

భాజపాపై తెరాస విమర్శలు గుప్పించింది. కాషాయం పార్టీలో క్రమశిక్షణ లోపించిందని ఆరోపించారు ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి, ప్రభుత్వ విప్ భానుప్రసాద్. తెలంగాణ ప్రజల గుండెల్లో తెరాస నిలిచిపోయిందని.. భాజపా ఆరోపణలు ఏమి చేయలేవన్నారు.

భాజపాలో గాడ్సే వారసులే ఉన్నారు: తెరాస
భాజపాలో గాడ్సే వారసులే ఉన్నారు: తెరాస
author img

By

Published : Jan 19, 2021, 5:08 AM IST

భారతీయ జనతాపార్టీలో క్రమశిక్షణ లోపించిందని ప్రజారంగ సంస్థల శాసనసభ కమిటీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి, ప్రభుత్వ విప్ భానుప్రసాద్ ఆరోపించారు. భాజపాలో గాడ్సే వారసులే ఉన్నారని జీవన్​రెడ్డి దుయ్యబట్టారు. తాము తలుచుకుంటే కాషాయం నేతలు ఎక్కడా తిరగలేరన్నారు. అవినీతికి మారుపేరైన భాజపా.. తెరాసపై మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాని కిషన్​రెడ్డి.. రూ. 10 వేల సాయం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. భాజపా ఇంఛార్జి తరుణ్​చుగ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని.. సొంత రాష్ట్రంలో రైతులు రోడ్లపై ఉన్నారని జీవన్​రెడ్డి దుయ్యబట్టారు.

భాజపా కరోనా వైద్యంలోనూ మత కోణాన్ని చూడటం దురదృష్టకరమని విప్ భానుప్రసాద్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో తెరాస నిలిచిపోయిందని.. భాజపా ఆరోపణలు ఏమి చేయలేవన్నారు. భాజపా తిట్ల కోసమే పుట్టినట్లుగా కనిపిస్తోందని.. ఆ పార్టీకి అభివృద్ధి అజెండా లేదన్నారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం: సబితా ఇంద్రా రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.