MLA Jeevan reddy on BJP and congress : రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపా కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. కోటి 51 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రెండు పార్టీల పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు తెలంగాణలో పాలనను చూసేందుకు రావాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు.
కాంగ్రెస్, భాజపా రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయని .. రాష్ట్రంలో తెరాసకు తిరుగులేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.
'దుబ్బాకలో భాజపా గెలిచింది. కాంగ్రెస్‌కు డిపాజిట్ తగ్గలేదు. అక్కడ కుమ్మక్కయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాలేదు. భాజపాకు 48 సీట్లు వచ్చాయి. అక్కడా కుమ్మక్కయ్యారు. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌కు కొన్ని ఓట్లు వచ్చాయి. భాజపాకు డిపాజిట్ రాలేదు. అక్కడ కూడా కుమ్మక్కయ్యారు. హుజూరాబాద్‌లో గతంలో 65 వేల ఓట్లు ఉన్న కాంగ్రెస్‌కు... ఈ పీసీసీ వచ్చాక 3వేల ఓట్లు వచ్చాయి. అక్కడ కూడా కుమ్మక్కయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండు సార్లు గెలిచిన మధుయాష్కికి డిపాజిట్ దక్కలేదు. అక్కడ కూడా భాజపాతో కాంగ్రెస్ కుమ్మక్కయింది. రెండు పార్టీల ఆఫీసులు నాంపల్లిలో ఉన్నాయి. నాంపల్లి బ్రదర్స్‌గా మారారు. కేసీఆర్ అంటే స్కీమ్‌ల పార్టీ... భాజపా అంటే స్కామ్‌ల పార్టీ. కేసీఆర్ అంటే నమ్మకం... భాజపా అంటే అమ్మకం పార్టీ.' -జీవన్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే
ఇదీ చదవండి: ప్రసాదమూర్తి, ఎం.నాగేశ్వరరావులకు అరుణ్‌సాగర్ విశిష్ట పురస్కారాలు