ETV Bharat / state

తప్పుల తడకగా ఓటరు జాబితా - ఓటర్లకు తప్పని గజిబిజి - EC Arrangements for Telangana Assembly Elections

Mistakes in Voters List in Telangana 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓటర్ల జాబితా గందరగోళంగా మారింది. ఓవైపు ఓటర్ల జాబితాలో పేర్లు లేక కొందరు.. మరోవైపు ఒకే కుటుంబంలోని ఓట్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్నవారు మరికొందరు. వెరసి ఓటరు జాబితా ప్రక్షాళన తప్పుల తడకగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 10:34 AM IST

Mistakes in Voters List in Telangana 2023 : శాసనసభ ఎన్నికల సందర్భంగా.. ఎంత ప్రక్షాళన చేసినా ఓటరు జాబితా (Telangana voters list) తప్పుల తడకగానే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటరు స్లిప్పుల పంపిణీలో భాగంగా లోపాలు అడుగడుగునా వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో.. సమస్య ఇదంటూ ఓటర్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఓ ఇంట్లో ఐదుగురు ఓటర్లుంటే.. మూడు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేయాల్సి వస్తోందని ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు. తమ ఓట్లు గల్లంతయ్యాయని, బతికుండగానే రద్దు చేశారని చింతలబస్తీ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023 : ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సీఈసీ కసరత్తు.. ఆకర్షణీయంగా పోలింగ్​ కేంద్రాల ముస్తాబు

దాని వల్ల ఏం జరుగుతుందంటే.. ఈనెల 30న జరిగే పోలింగ్‌ రోజున (Telangana Assembly Elections 2023 ).. ఓ ఇంట్లోని ఓటర్లందరూ ఒకే పోలింగ్‌ కేంద్రంలో వేయవచ్చని అధికారులు ప్రకటించారు. కానీ వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తే కొందరు బద్దకించి ఓటు వేసేందుకు వెళ్లకపోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. మరోవైపు.. 2018 ఎన్నికల్లో మేడ్చల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 6 లక్షల ఓటర్లకు ఈ సమస్య ఉండేదని .. అందులో హైదరాబాద్‌లోనే ఒక కుటుంబం లేదా ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండి ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న వారు 4 లక్షల మంది ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. అప్పట్నుంచి జరిగిన ఓటరు సవరణల్లో తప్పిదాలను సరిదిద్దామని తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు అలాగే ఉన్నాయి.

ఇవిగో ఉదాహరణలు..

  • ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని కోదండరామనగర్‌లోని ఓ ఇంట్లో ఐదుగురు ఓటర్లు ఉన్నారు. కానీ ఆ ఓట్లు మూడు పోలింగ్‌ కేంద్రాల్లోకి మారాయి.
  • అదే కోదండరామ్‌నగర్‌లోని సావిత్రి సదన్‌ అపార్ట్‌మెంట్‌లో 40 మంది ఓటర్లు ఉండగా.. వారి ఓట్లు 6 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉండటం గమనార్హం.
  • ఖైరతాబాద్‌ నవీన్‌నగర్‌లో ఒక కుటుంబంలో ముగ్గురు ఓటర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు ఒక పోలింగ్‌ కేంద్రంలో, మరొకరు వేరే చోట వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
  • వెంకటరమణ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్లో.. మూడు పోలింగ్‌ కేంద్రాల్లోని ఓటర్లు ఉండటం గమనార్హం.

EC Focus on Social Media Campaign : సోషల్​ మీడియాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారా ఈసీ ఓ కంట కనిపెడుతోంది జాగ్రత్త సుమీ

బీఎల్‌ఓల నిర్లక్ష్యం..

  • మూడు జిల్లాల పరిధిలో 7,000 ల పోలింగ్‌ కేంద్రాలు (Polling stations) ఉన్నాయి. దీనికి ఏడువేల మంది బీఎల్‌ఓ (బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌)లు ఉంటారు. వీరిలో చాలామంది నిరక్ష్యరాసులు. ఈ క్రమంలో ఓటరు దరఖాస్తుల పరిశీలన, జాబితా సవరణ సవ్యంగా జరగలేదు. ఓవైపు ఇష్టానుసారంగా ఓటర్లను చేర్చారు. మరోవైపు ఓటర్లను తొలగించారు.
  • ఒక కుటుంబం, అపార్ట్‌మెంట్ల ఓటర్లను ఒకే పోలింగ్‌ కేంద్రంలోకి మార్చేందుకు ఫారం-8 నింపాలి. ఓటరు స్వయంగా దరఖాస్తు చేసుకుంటే అధికారులు విచారించి ఆమోదం తెలుపుతారు.
  • చాలామందిని ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలోకి మార్చామని, కొందరు స్పందించలేదని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ఒకరు చెప్పారు.

Voter list Process in TS : మరో దఫా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టిన ఈసీ

Telangana Voter List: ఓటర్ల లిస్ట్‌ రిలీజ్.. తెలంగాణలో ఎంతమంది ఉన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.