ETV Bharat / state

KTR Challenge: గంగులపై గెలవాలని బండి సంజయ్​కు కేటీఆర్​ సవాల్‌ - Telangana news

KTR Challenge: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి తెరాస అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్‌... బరిలోకి దిగుతారని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో గంగుల చేతిలో ఓడిన బండి సంజయ్‌ ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కమలాకర్‌ మీద పోటీ చేసి గెలవాలని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స‌వాల్ విసిరారు.

KTR
KTR
author img

By

Published : Mar 18, 2022, 5:22 AM IST

KTR Challenge: కరీంనగర్‌లో రూ. 1,067 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు... పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న ఆయన... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. సంజయ్‌ అనుకోకుండా ఎంపీ అయ్యారన్న కేటీఆర్ మూడేళ్లుగా నయాపైసా అభివృద్ది చేయలేదని మండిపడ్డారు.

గంగుల చేతిలో రెండు సార్లు పరాజయాలు చవిచూసిన బండి సంజయ్ కుమార్‌ను వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. లక్షకు పైగా మెజారిటీతో గంగులను గెలిపించి... నియోజకవర్గ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయేలా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క‌రీంన‌గ‌ర్‌ను ఒక ల‌క్ష్మీన‌గ‌రంగా సీఎం కేసీఆర్‌ చూస్తారన్న కేటీఆర్‌... ఇక్కడ ప్రారంభించే ప్రతి ప‌ని విజ‌య‌వంతం అవుతుంద‌ని న‌మ్ముతారని తెలిపారు.

మోదీ సర్కారు చేసిందేమీ లేదు..

పేదలకు, బలహీన వర్గాలకు మోదీ సర్కారు చేసిందేమి లేదని మంత్రి కేటీఆర్​ విమర్శించారు. ఎప్పటికైనా కష్టసుఖాల్లో తోడుండేది గులాబీ జెండా మాత్రమేనన్నారు. తాము ఇటీవలే కరీంనగర్​కు మెడికల్​ కాలేజీ మంజూరు చేశామన్నా ఆయన.. అన్ని జిల్లాల్లో మెడికల్​ కళాశాలలు వస్తాయన్నారు. తెలంగాణలో విద్యార్థులు ఉక్రెయిన్​, ఫిలిప్పిన్స్​కు మెడికల్​ విద్య కోసం పోయే బాధ ఉండదన్నారు. తెలంగాణ రాకముందు 150 లోపు గురుకుల పాఠశాలలుంటే.. ఇప్పుడు 900 గురుకుల పాఠశాలల పెట్టి.. నాణ్యమైన విద్యను లక్షలాది మంది విద్యార్థులకందిస్తున్నామన్నారు. ఉన్నత విద్య కోసం 16 వేల కోట్ల రూపాయలను ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద ఇస్తున్నామన్నారు. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే వారికోసం అంబేడ్కర్​ ఓవర్సీస్, జ్యోతిబాపూలే ఓవర్సీస్ స్కీం కింద 20 లక్షలు ఇస్తున్నామన్నారు. 26 వేల సర్కారు స్కూళ్లను రూ.7,300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.