కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని బుద్దుడి విగ్రహం వద్ద బౌద్ధానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఆయన విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. బౌద్ధ మతానికి అత్యంత ప్రాముఖ్యత ఉందని... మన దేశం నుంచి బౌద్ధం విదేశాలకు సైతం చేరిందని ఈటల పేర్కొన్నారు.
నిన్న డ్రైరన్ నిర్వహించాం. 10వేల మందికి ఇందులో శిక్షణ ఇప్పించి... ఎన్ని లక్షల మందికైనా.. ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి మనకు ఆ తాఖతు ఉంది. వ్యాక్సినేషన్లో గొప్ప పేరుపొందిన రాష్ట్రం తెలంగాణ.
-- ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇదీ చూడండి: కొవాగ్జిన్‌కు డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్.. త్వరలోనే పంపిణీ