ETV Bharat / state

'తెలంగాణ ఖ్యాతిని చాటేలా కొత్త సచివాలయ నిర్మాణం జరగాలి' - కొత్త సచివాలయ నిర్మాణంపై మంత్రి సమీక్ష హైదరాబాద్​

సీఎం కేసీఆర్​ ఆలోచనలకు అనుగుణంగా, తెలంగాణ ఖ్యాతిని చాటేలా కొత్త సచివాలయ నిర్మాణం జరగాలని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి ఆదేశించారు. 12 నెలల్లో సచివాలయ పనులు పూర్తి కావాలని.. మొత్తం భవనాన్ని ఆరు ప్రాజెక్టులుగా విభజించి ఒక్కో భాగానికి ఒక్కో వర్కింగ్ టీమ్​లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. విస్తరణ జాయింట్ పనులను నాణ్యతతో చేసేలా ప్రపంచంలోని ఉత్తమమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. ప్రతివారం తాను స్వయంగా సచివాలయ ప్రాంతానికి వచ్చి పనులను పర్యవేక్షిస్తానని ప్రశాంత్​ రెడ్డి తెలిపారు.

'తెలంగాణ ఖ్యాతిని చాటేలా కొత్త సచివాలయ నిర్మాణం జరగాలి'

author img

By

Published : Nov 5, 2020, 10:51 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా దేశం అబ్బురపడేలా, తెలంగాణ ఖ్యాతిని చాటేలా కొత్త సచివాలయ నిర్మాణం జరగాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సచివాలయ పనులపై వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, ఆర్ అండ్ బీ ఇంజినీర్లు, గుత్తేదారు ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

సీఎం ఆదేశాల మేరకు 12 నెలల్లో సచివాలయ పనులు పూర్తి కావాలని.. మొత్తం భవనాన్ని ఆరు ప్రాజెక్టులుగా విభజించి ఒక్కో భాగానికి ఒక్కో వర్కింగ్ టీమ్​లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆర్ అండ్ బీ శాఖ నుంచి 12 మంది జేఈలు, ముగ్గురు డీఈలు, ఒక ఈఈ, ఒక ఎస్ఈని ప్రత్యేకంగా నియమించుకోవాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఎలక్ట్రికల్, మెకానికల్ పనుల కోసం అదనంగా ముగ్గురు జేఈలు, ఇద్దరు డీఈలు, ఒక ఈఈని నియమించుకోవాలన్నారు.

గుత్తేదారు షాపూర్ జీ పల్లోంజీ సంస్థ తరఫున కూడా 12 మంది క్షేత్రస్థాయి ఇంజినీర్లు , ఆరుగురు ప్రాజెక్ట్ ఇంజినీర్లు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్​ని నియమించుకోవాలని మంత్రి తెలిపారు. ఆర్కిటెక్ట్ వైపు నుంచి కూడా ఆరు పర్యవేక్షణ బృందాలను నియమించాలని చెప్పారు. ఆర్ అండ్ బీ ఎస్ఈ, ఆర్కిటెక్ట్, షాపూర్ జీ పల్లోంజీ సంస్థలు ప్రాజెక్ట్​ను ప్రతి నెల వారీగా చేయాల్సిన పనులతో 11 నెలలు లక్ష్యంగా తీసుకొని ప్రణాళిక రూపొందించాలని ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.

విస్తరణ జాయింట్ పనులను నాణ్యతతో చేసేలా ప్రపంచంలోని ఉత్తమమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని మంత్రి సూచించారు. ప్రతివారం తాను స్వయంగా సచివాలయ ప్రాంతానికి వచ్చి పనులను పర్యవేక్షిస్తానని ప్రశాంత్​ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: సచివాలయ నిర్మాణ పనులు దక్కించుకున్న షాపూర్​జీ పల్లోంజీ సంస్థ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.