ETV Bharat / state

'పని చేసే అభ్యర్థిని గెలిపించుకోండి'

గోశామహల్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. భాజపా నాయకుల మాటతీరుపై మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Talsani participated in the graduate MLC election campaign in Goshamahal constituency.
'పని చేసే అభ్యర్థిని గెలుపించుకోండి'
author img

By

Published : Mar 5, 2021, 9:31 AM IST

భాజపా నాయకులు వారి రాజకీయ లబ్ధి కోసం... ఇష్టానుసారంగా మాట్లాడటం తప్ప... ప్రజా సంక్షేమం పట్టదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గోశామహల్ నియోజకవర్గంలోని ఆదర్శనగర్​లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా... తెరాస అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని తలసాని విజ్ఞప్తి చేశారు.

ఓటు హక్కు ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ విధిగా ఓటేసి... పోలింగ్ శాతాన్ని పెంచి... పని చేసే అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. గతంలో గెలిచిన భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు కనీసం ఒక నియోజకవర్గంలో కూడా తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరించలేదని... మండలిలో సమస్యలపై గళం వినిపించని వ్యక్తి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గోశామహల్ తెరాస ఇంఛార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్, కరీంనగర్ డిప్యూటీ మేయర్ హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​కు ప్రతిష్ఠాత్మక అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.