రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఏర్పాటు చేసిన 'రోడ్ కమ్ రివర్ క్రూజ్' టూర్ బస్సును బషీర్బాగ్లోని కేంద్ర పర్యాటక కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో మాదిరి మన రాష్ట్రంలో కూడా అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయని పేర్కొన్నారు. త్వరలో సోమశిలకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ భూపతి రెడ్డి, ఎండీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీచూడండి గ్రామపంచాయతీ వ్యవస్థలో నూతన శకం ఆరంభం..!