ETV Bharat / state

జలవిహార్​ వద్ద నీరా స్టాల్​కు మంత్రి స్థల పరిశీలన

కేసీఆర్​.. సీఎం అయ్యాక కులవృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. అందుకే గౌడ కులస్థుల కోసం నీరా ప్రాజేక్టు ఏర్పాటు చేస్తూ 116 జోవో విడదల చేశారని తెలిపారు. హైదరాబాద్​లో నీరా స్టాల్​ ఏర్పాటుకు జలవిహార్​ వద్ద టూరిజం ఎండీ మనోహర్​తో కలిసి మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ స్థలాన్ని పరిశీలించారు.

జలవిహార్​ వద్ద నీరా స్టాల్​కు మంత్రి స్థల పరిశీలన
author img

By

Published : Nov 12, 2019, 8:09 AM IST

జలవిహార్​ వద్ద నీరా స్టాల్​కు మంత్రి స్థల పరిశీలన
రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టదలచిన నీరా కేంద్రం ఏర్పాటుకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేశ్​ కుమార్, టూరిజం ఎండీ మనోహర్‌తో కలిసి హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్‌లోని జలవిహార్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. సర్వే చేసి, ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని ఆర్కిటెక్ట్​ను ఆదేశించారు.

గత ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకోలేదని.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక కులవృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. అందులో భాగంగా గౌడ కుల వృత్తిని ఆదుకోవడానికి నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తూ 116 జీవోను విడుదల చేయడం జరిగిందన్నారు. తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో ఫుడ్ కోర్ట్​ను ఏర్పాటు చేసి నీరా స్టాల్​ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం విడతల వారీగా జిల్లాలలో ఏర్పాటు చేస్తామని శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు.

ఇవీచూడండి: గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్​ వీడియో

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.