ETV Bharat / state

గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​ - minister

కూకట్​పల్లి నియోజకవర్గంలోని ఇందిరానగర్​లో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పర్యటించి గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటారు. స్థానిక సమస్యలను త్వరలోనే పరిష్కరించి మంచినీటి సరఫరా, కరెంట్​, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించడానికి  తన వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.

గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : Sep 15, 2019, 12:18 PM IST

కూకట్​పల్లి నియోజకవర్గంలోని బాలానగర్​ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించి గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటారు ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్.​పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న తమకు కనీసం కరెంటు, మంచినీటిని సరఫరా చేయక అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఇందిరా గాంధీ నగర్, ప్రశాంత్ నగర్ ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే వారికి కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి త్వరలోనే డబుల్​ బెడ్​ రూమ్​ ఇల్లు కట్టించేందుకు ప్రతిపాదనలు చేస్తానని తెలిపారు.

గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​

ఇదీ చూడండి: ఆదర్శ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ 'కంగ్టి' పీహెచ్​సీ

Intro:TG_hyd_13_15_minister_harithaharam_at_balanagar_AB_TS10021

raghu_sanathnagar_9490402444.

హైదరాబాద్ నగరం పచ్చదనం గా ఉండాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు
హరితహారం గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఆదివారం స్థానిక కూకట్పల్లి నియోజకవర్గం లోని స్థానిక బాల నగర్ డివిజన్ లోని నర్సాపూర్ చౌరస్తా లో ఉన్న చిత్తారమ్మ బస్తీలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,,కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,, ఎమ్మెల్సీ ఇ నవీన్ కుమార్ రావ్ హరితహారం లో భాగంగా మొక్కలను నాటారు

Body:ఈ సందర్భంగా గా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించి ఒక్కొక్కరు ఒక మొక్కను నాటాలని ఆయన పిలుపునిచ్చారు తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ హరితహారం గ్రీన్ ఛాలెంజ్ పిలుపులో భాగంగా తాము కూడా అ మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చామని మంత్రి తెలిపారు అదే విధంగా ప్రజలు భావితరాల యువకులు కూడా పచ్చదనాన్ని పెంపొందించడం పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు

Conclusion:అనంతరం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ హరితహారం గురించి హిందీ లో భాగంగా తమ టిఆర్ఎస్ నాయకులు సంతోష్ కుమార్ పిలుపుమేరకు మొక్కలు నాటేందుకు తమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యంగా తమ నియోజకవర్గంలోని కార్పొరేటర్ లందరూ ఇందులో భాగంగా మొక్కలు నాటాలని కార్పొరేటర్లకు ఎమ్మెల్యే గ్రీన్ ఛాలెంజ్ చేశారు
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు జోనల్ కమిషనర్ మమత డిప్యూటీ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు

bite...1.. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
bite...2... కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.