ETV Bharat / state

అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ఇవాళ మద్యం దుకాణాలు తెరవడం వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులను మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తెలుసుకున్నారు. లిక్కర్​ అందుబాటులో లేకపోతే గుడుంబా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అందుకే కేబినెట్ సమావేశంలో​ చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

author img

By

Published : May 6, 2020, 9:44 PM IST

minister srinivas goud spoke on gudumba
అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

గుడుంబా తయారు చేసినా.. సరఫరా చేసినా.. అమ్మినా.. అక్రమ మద్యం సరఫరా చేసిన వారిపై పీడీ చట్టం కింద కేసులు పెడతామని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. ఇవాళ మద్యం దుకాణాలు తెరవడం వల్ల... క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పరిశీలించారు. ఆర్థిక పరిస్థితుల కంటే కూడా ప్రజల ప్రాణాలు ముఖ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని ఆయన అభిప్రాయపడ్డారు.

లాక్​డౌన్ పరిస్థితుల్లో మద్యం దుకాణాలన్నీ మూసివేయబడ్డాయని..ఇప్పుడు దేశం అంతా తెరచుకోవచ్చని కేంద్రం ప్రభుత్వం అనుమతించిందని ఆయన వివరించారు. లిక్కర్ అందుబాటులో లేకపోతే మళ్లీ గుడుంబా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. అలా జరగకూడదనే రాష్ట్రంలో మద్యం షాపులను తెరిచినట్లుగా చెప్పారు. తెలంగాణ పొరుగు రాష్ట్రాలు ముందుగానే మద్యం దుకాణాలను తెరవడంతో వేరే రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం కూడా వచ్చిందని చెప్పారు.
అందువల్లే సీఎంతో కేబినెట్‌లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. చాలా మద్యం దుకాణాలను పరిశీలించానని... అన్ని దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తున్నారని.. శానిటైజేషన్​ చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు.

ఇవీ చూడండి: అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.