గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని... క్రీడా, యువజనశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా సీఎం కప్, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహిస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లో క్రీడా అకాడమీలు, సమస్యలపై అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడా పాలసీపై ముఖ్యమంత్రి సబ్‌కమిటీ ఏర్పాటు చేశారన్న ఆయన... అకాడమీల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: నుమాయిష్ వాయిదా... కొవిడ్ నిబంధనలే కారణం