జమ్మూ కశ్మీర్ లడక్‌లోని లేహ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రమదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన సైనిక హవల్దార్ పరశురాం మృతదేహం శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. పరుశురాం భౌతికకాయానికి విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి నివాళి అర్పించారు. దేశ సేవలో అసువులు బాసిన పరుశురాం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.
పరుశురాం కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీర్ ఆదేశాల మేరకు... రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో రెండు పడకగదుల ఇల్లును కేటాయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో పాటు సైనిక సంక్షేమ నిధి నుంచి నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు పరుశురాం భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో శ్రద్ధాంజలి ఘటించారు.
ఇదీ చూడండి: ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి