హర్యానా వేదికగా జరిగిన పోటీల్లో జాతీయ హార్డ్ కోర్ట్ ఛాంపియన్‌గా నిలిచిన యువ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మికను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రష్మికను సన్మానించి... ఆర్థిక సహాయం అందించారు. గత ఆదివారం జరిగిన టోర్నీలో సీనియర్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించింది. రష్మికకు అన్ని విధాల సహకారం అందిస్తామని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.