ఖేలో ఇండియా స్కీమ్‌లో భాగంగా ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు ఎంపికైనా క్రీడాకారులను.. రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వెయిట్ లిఫ్టింగ్‌లో మంచి ప్రతిభ కనబర్చి.. రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి క్రీడాకారులను కోరారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు.. ప్రభుత్వం అన్ని విధాలుగా సాయపడుతుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, క్రీడాకారులు సాయి వర్ధన్, శేషసాయి, భరత్‌కుమార్, సహస్ర, స్వరాజ్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కోహ్లీ క్రీడాస్ఫూర్తికి అభిమానులు ఫిదా