ETV Bharat / state

SATYAVATHI: గత పాలకులది ఓటు రాజకీయం.. తెరాసది సంక్షేమ మార్గం - తెలంగాణ తాజా వార్తలు

గిరిజనులను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి సత్యవతి రాఠోడ్​ పేర్కొన్నారు. గిరిజన బిడ్డల నాణ్యమైన విద్యకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దళితుల జీవితాలను వారే మార్చుకునేలా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చామన్న మంత్రి.. త్వరలోనే పోడు భూముల సమస్యనూ తీరుస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో సత్యవతి రాఠోడ్​ పాల్గొన్నారు.

SATYAVATHI: 'పోడు భూముల సమస్యను త్వరలోనే తీరుస్తాం'

author img

By

Published : Aug 9, 2021, 6:39 PM IST

SATYAVATHI: 'పోడు భూముల సమస్యను త్వరలోనే తీరుస్తాం'

గత ప్రభుత్వాలు ఆదివాసీలను ఓటు బ్యాంకుగా చూసి రాజకీయాలు చేస్తే.. తెరాస సర్కారు వారి సంస్కృతిని పరిరక్షిస్తూ.. అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ (satyavathi rathod)పేర్కొన్నారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మాసబ్​ట్యాంక్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్​లలో జరిగిన ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆదివాసీలు గుస్సాడీ, దింసా నృత్యాలు చేయగా.. మంత్రి వారితో ఆడిపాడారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గిరిజన ప్రజల వంటకాలను మంత్రి రుచి చూశారు. ఈ సందర్భంగా ఆదివాసీల అభ్యున్నతి కోసం పాటుపడిన వారిని సన్మానించి, 10 మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు సీఎం ఎస్టీ ఎంటర్​ప్రిన్యూర్​షిప్ పథకం కింద రూ.4.4 కోట్ల విలువ చేసే చెక్కులను అందించారు. గురుకులాల్లో చదువుతూ దేశంలో ప్రముఖ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన 183 మంది విద్యార్థులకు ల్యాప్​టాప్​లు అందజేశారు.

ఈ సందర్భంగా గిరిజనులను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు, వారి అభ్యున్నతికి పాటుపడేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. గిరిజన ఆవాసాలన్నింటికీ త్రీ ఫేస్ కరెంట్, రోడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దళితుల జీవితాలను వారే మార్చుకునేలా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చామని వివరించారు.

త్వరలోనే పోడు భూముల సమస్యకు పరిష్కారం..

సుమారు 4 వేల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, అక్కడ అన్ని వసతులు కల్పిస్తూ వాటి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. 6 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 10 శాతం పెంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపామని తెలిపారు. గిరిజన బిడ్డల నాణ్యమైన విద్యకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి.. త్వరలోనే పోడు భూముల సమస్యను సైతం తీరుస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 32 లక్షల మంది గిరిజన జనాభా ఉండగా.. 32 తెగలు ఉన్నాయి. ఇందులో 4 అంతరించిపోతున్న ఆదివాసీ తెగలు(పీవీటీజీ) ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 74 గిరిజన రైతు ఉత్పత్తి సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఒక్కో దానిలో 400 మంది సభ్యులు ఉన్నారు. ఆదివాసీ దివస్​ను పురస్కరించుకొని ఇవాళ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వారి సంస్కృతి, సాంప్రదాయాలను చాటుతూనే.. గిరిజన అభ్యున్నతి ప్రభుత్వ ప్రాధామ్యాల్లో ఒకటని చాటి చెప్పారు. -సత్యవతి, మంత్రి

ఇవీ చూడండి..

గిరిజన కళాకృతుల ప్రదర్శన.. ఆకట్టుకుంటున్న ప్రకృతి వైద్యం.!

TAMILISAI: ఆదివాసీల జీవన విధానంపై సర్వే.. త్వరలోనే మ్యూజియం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.