దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాల్లో నాణ్యమైన విద్యను తెరాస ప్రభుత్వం అందిస్తోందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. గురుకులాలను ముఖ్యమంత్రి కేసీఆర్ బలోపేతం చేసి... విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు కూడా బాగా పనిచేసి గిరిజన గురుకులాలను దేశంలో నంబర్ వన్‌గా చేయాలని మంత్రి కోరారు. హైదరాబాద్‌లో తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ టీచర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో జనాభా కంటే.. ఆధార్ కార్డులే ఎక్కువట.?