ETV Bharat / state

'ప్రైవేటు పాఠశాలల్లో రుసుములను గాడిన పెడతాం' - State Education Minister P. Sabita Indrareddy latest information

‘ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది... ఇంజినీరింగ్‌ కళాశాలల మాదిరిగానే పాఠశాలల్లోనూ వసతులను బట్టి రుసుములను నిర్దేశించేందుకు చర్యలు చేపడుతున్నామ’ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి డిజిటల్‌ పాఠాలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని తరగతుల్లో సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ బోధన ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించిన నేపథ్యంలో వివిధ అంశాలపై మంత్రి శుక్రవారం ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. విద్యార్థుల చదువు, వారి భవిష్యత్తుపై రాజీ పడేది లేదని ఆమె తెలిపారు.

minister sabitha indra reddy said We will put fees in private schools in telangana
'ప్రైవేటు పాఠశాలల్లో రుసుములను గాడిన పెడతాం'
author img

By

Published : Aug 29, 2020, 5:29 AM IST

'ప్రైవేటు పాఠశాలల్లో రుసుములను గాడిన పెడతాం'

విద్యాసంస్థల పురోగతిలో బోధన, బోధనేతర సిబ్బంది భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అలాంటి వారిని ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకుండా వేతనాలు ఇవ్వాలని గతంలోనే సూచించామని.. మానవత్వంతో ఆలోచించాలని యాజమాన్యాలను కోరుతున్నానని మంత్రి తెలిపారు.

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులు చదువు విషయంలో నష్టపోరాదని టీవీ మాధ్యమాల ద్వారా డిజిటల్‌ తరగతులు అందించాలనిచిరు ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలని... తల్లిదండ్రులు సైతం పిల్లలకు కొంత సమయం కేటాయించి వారిని ప్రోత్సహించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల అనంతరమే బడులను ఎప్పుడు తెరవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు డిజిటల్‌ పాఠాలను కొనసాగిస్తామన్నారు. బడులను తెరిచేవరకు విద్యా వాలంటీర్లు, పార్ట్‌ టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లను విధుల్లోకి తీసుకోలేం.

డిజిటల్‌ పాఠాలు బోధించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మారుమూల ప్రాంతాల్లోని వారికి ఎలా?

ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులకు వనరులు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారు పేద కుటుంబాలకు చెందిన వారు. వారందరూ నష్టపోరాదు. రాష్ట్రంలో 95 శాతానికి పైగా కుటుంబాల్లో టీవీలు ఉన్నందున వాటి ద్వారా పాఠాలు ప్రసారం చేస్తేనే అందరికీ అందుతాయని భావించాం. సెప్టెంబరు 1వ తేదీ నుంచి టీవీల ద్వారా తరగతులు జరపాలని నిర్ణయించాం. టీవీలు, స్మార్ట్‌ ఫోన్లు లేని వారికి గ్రామ పంచాయతీ టీవీలను వినియోగించుకోవాలని ఆదేశించాం. ఎంత మందికి అవి లేవన్న దానిపై సర్వే చేస్తున్నాం. లక్ష మంది వరకు టీవీలు ఉండకపోవచ్చని అనుకుంటున్నాం. అలాంటి వారికి వర్క్‌ షీట్లు అందజేస్తున్నాం. ఉపాధ్యాయులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని చెప్పాం. ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందులున్నా, తర్వాత సమసిపోతాయి. ప్రతి విద్యార్థికి పాఠాలు అందిస్తాం. తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాల్లో వాటిని ప్రసారం చేస్తాం. పిల్లల సందేహాలను తీర్చేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫోన్‌ నంబర్లు ఇచ్చి పుచ్చుకోవాలని ఆదేశించాం.

ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల విషయంలో నిబంధనల మాటేమిటి..?

కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజ్ఞత’ పేరిట ఆన్‌లైన్‌ తరగతులకు మార్గదర్శకాలిచ్చింది. తరగతిని బట్టి రోజుకు 30 నిమిషాల నుంచి 3 గంటలు మాత్రమే నిర్వహించాలి. అదీ వారానికి అయిదు రోజులే. ఆ నిబంధనలను పాటించాలని ఆదేశించాం. అంతకు మించి ఎక్కువ సమయం పిల్లల్ని ఎలక్ట్రానిక్‌ తెరల ముందు కూర్చోబెడితే పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం.

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ పై ఏంచేస్తారు..?

ఈ ఏడాది ఫీజులు పెంచొద్దని, గత సంవత్సరం రుసుములే వసూలు చేయాలని జీఓ 46 జారీ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణే. ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులు వస్తే 17 పాఠశాలలకు నోటీసులు ఇచ్చాం. నిబంధనలు ఉల్లంఘించాయని రుజువైతే చర్యలు తీసుకుంటాం. ఇంజినీరింగ్‌ కళాశాలల తరహాలో పాఠశాలలకు కూడా ఏడాది రుసుము ఎంతన్నది నిర్దేశించాలని ముఖ్యమంత్రి ఆలోచన. ఆయా పాఠశాలల్లో వసతులు, అందిస్తున్న సేవలు, ఉపాధ్యాయుల సంఖ్య, ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుములు, ఆదాయం, వ్యయం తదితర వివరాలను సేకరిస్తున్నాం. అధికారులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఏటా ఎంత పెంచుకోవచ్చన్నది కమిటీ నిర్ణయిస్తుంది. సమీప భవిష్యత్తులో ఫీజుల సమస్య ఉత్పన్నం కావొద్దన్నది మా ఆలోచన.

ఆయా తరగతుల్లో సిలబస్‌ను తగ్గిస్తారా?

పనిదినాలు తగ్గుతున్నందున అందుకు తగ్గట్టు సిలబస్‌ కూడా తగ్గిస్తాం. ఎంత తగ్గించాలన్న దానిపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది.

ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలవుతుందా?

10 శాతం కోటా అమలు చేసేందుకు అవసరమైన దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది యాజమాన్య కోటా ఉండదు. ఆయా వర్సిటీలకు ఉపకులపతులను నియమించాలని తాజాగా సీఎం ఆదేశించారు. వీలైనంత త్వరలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన జాతీయ నూతన విద్యా విధానంపై ఏమనుకుంటున్నారు?

దానిపై ఇంకా లోతుగా చర్చలు జరగాలి. గతంలోనూ ప్రభుత్వం తరఫున పలు సూచనలు చేశాం. క్రమేణా విద్యా విధానాన్ని అమలు చేస్తాం.

జేఈఈ, నీట్‌ను వాయిదా వేయాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్‌ చేస్తున్నాయి? దీనిపై తెలంగాణ వైఖరి ఏమిటి ?

ఆ పరీక్షలను జరుపుకోవచ్చని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా మన విద్యార్థులు వెనకబడిపోరాదన్నది మా ఉద్దేశం. ప్రవేశ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. చివరి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో దాదాపు 67 లక్షల మందిని పరీక్షలు లేకుండా ప్రమోట్‌ చేశాం. చివరి సెమిస్టర్‌ వారినీ చేయొచ్చు. వారు దేశవ్యాప్తంగా నెగ్గుకు రావాలంటే పరీక్షలు జరపాలన్నది మా ఉద్దేశం. హైకోర్టు ఆదేశం మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం. పిల్లల భవిష్యత్తుపై రాజీ పడం.

ఇదీ చూడండి : హైకోర్టులో పిటిషన్​.. రూ.50 వేలు జరిమానా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.