ROJA DANCE AT JAGANANNA GOLDEN JUBILEE CELEBRATIONS : ఏపీ గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు రోజా, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. మంత్రి రోజా సైతం వేదిక ఎక్కి యువతులతో కలిసి నాట్యం చేశారు. దీంతో ఆడిటోరియం చప్పట్లతో మారుమ్రోగింది.
సాంస్కృతిక శాఖ తరఫున చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా రోజా చేస్తున్న కార్యక్రమాలను మేరుగ నాగార్జున అభినందించారు. వైసీపీ పార్టీకి రోజా బలమైన నాయకురాలని వ్యాఖ్యానించారు. ఆమె నేతృత్వంలో సాంస్కృతిక శాఖ మరింత ముందుకు వెళ్తుందన్నారు.
ఇవీ చదవండి:
ప్రభాస్‌తో పెళ్లి.. ఎట్టకేలకు నిజం ఒప్పేసుకుందిగా కృతిసనన్!