తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్మారక స్థూపం నిర్మించాలని సీఎం తలపెట్టారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని లుంబిని పార్కు వద్ద కొనసాగుతున్న స్మారక నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని ఆయన తెలిపారు.
నగరానికి ఎవరు వచ్చినా స్మారకాన్ని చూసి, శ్రద్ధాంజలి ఘటించేలా నిర్మిస్తున్నామని వివరించారు. 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్మారకం నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. స్మారకంలో ఆర్ట్ గ్యాలరీ, వీడియో గ్యాలరీ, లైబ్రరీ, అతిపెద్ద సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: వర్షం వస్తే... ఈ ఊరు జలదిగ్బంధం అవుతుంది