ETV Bharat / state

కంది, పత్తి, నూనె గింజల సాగు పెంచాలి: నిరంజన్​ రెడ్డి - ఖరీఫ్​ పంటలపై మంత్రి నిరంజన్​ రెడ్డి సమావేశం

రానున్న ఖరీఫ్ సీజన్​లో కంది, పత్తి, నూనె గింజల సాగును పెంచాలని అధికారులను మంత్రి నిరంజన్​ రెడ్డి ఆదేశించారు. సాగు విస్తీర్ణం పెరుగుతున్న దృష్ట్యా ఈ పంటలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని చెప్పారు. వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యతపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ​

minister niranjan reddy
మంత్రి నిరంజన్ రెడ్డి
author img

By

Published : Apr 10, 2021, 4:50 PM IST

రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్న దృష్ట్యా వరి కాకుండా... కంది, పత్తి, నూనెగింజల సాగు మేలని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఖరీఫ్​ను దృష్టిలో పెట్టుకొని ఇప్పట్నుంచే రైతులను క్షేత్రస్థాయిలో చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యతపై హైదరాబాద్​లోని మంత్రుల నివాస సముదాయంలో తన నివాసం నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో మంత్రి జూమ్ ద్వారా సమీక్షించారు.

డిమాండ్​ ఉంది..

వ్యవసాయ అనుకూల విధానాలు, 24 గంటల ఉచిత విద్యుత్​, రైతుబంధు, రైతు బీమా, సాగు నీటితో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోందని మంత్రి ప్రస్తావించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా నూనెగింజలకు మార్కెట్​లో మంచి డిమాండ్ ఉన్నందున విత్తన కంపెనీలు.. నూనెగింజల విత్తనాలను విస్తృతంగా రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయాలను బలంగా రైతుల్లోకి తీసుకువెళ్లడంతోపాటు రాబోయే రెండు నెలలు సమయస్ఫూర్తితో పని చేయాలని సూచించారు.

నిర్ణీత సమయానికి..

ఖరీఫ్​లో కంది 20 లక్షల ఎకరాలు, పత్తి సాగు 75 లక్షల ఎకరాలకు పెంచాలని మంత్రి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా 57 పత్తి విత్తన కంపెనీల ద్వారా 170 లక్షల నాణ్యమైన పత్తి విత్తన ప్యాకెట్లు నిర్ణీత సమయానికి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దేశంలో తొలిసారి క్యూ ఆర్ కోడ్, సీడ్ ట్రేసబిలిటీతో నాణ్యమైన విత్తనాలను అందించాలని పేర్కొన్నారు. మొత్తం 90 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు 22 లక్షల క్వింటాళ్ల ధ్రువీకరించిన విత్తనాలు మే 15 వరకు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉండాలని చెప్పారు.

పీడీ యాక్ట్​..

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని.. అక్రమార్కులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని మంత్రి హెచ్చరించారు. పత్తి సాగు మీద జిల్లాల వారీగా సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సంచాలకులు డాక్టర్ కేశవులు, ప్రాంతీయ సంచాలకులు బాలు, డీడీఏ శివప్రసాద్, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ఆ రెండు పార్టీలు సాగర్​ను పాలించినా అభివృద్ధి శూన్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.