ETV Bharat / state

'చట్టం చదువుకుని... రంగంలోకి దిగండి' - మేయర్లకు మంత్రి కేటీఆర్ హెచ్చరిక

ఇంటి ముందు ఇసుక, కంకర కుప్పలు చూడగానే... కౌన్సిలర్లు వచ్చి నా సంగతేంది అని అడిగే పద్ధతి పోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ నూతన మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సూచించారు. తప్పు చేసిన వారి పదవులు ఊడటం ఖాయమని హెచ్చరించారు.

minister ktr warns that the positions of mayors and municipal chairman will be lost if they make any mistakes
'తప్పు చేస్తే పదవులు ఊడటం ఖాయం'
author img

By

Published : Jan 30, 2020, 3:23 PM IST

నూతనంగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కొత్త పురపాలక చట్టం క్షుణ్ణంగా చదువుకుని రంగంలోకి దిగాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సూచించారు. గెలవగానే అహంకారం తలకెక్కొద్దని, తెలంగాణను మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్​తో కలిసి ముందుకు నడవాలని కోరారు.

కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవినీతికి దూరంగా ఉండాలని, తప్పు చేస్తే పదవులు ఊడతాయని హెచ్చరించారు. అవినీతి రహిత సేవలందించడమే తమ ధ్యేయమని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు తాము పట్టించుకోమని, మీరు పట్టించుకోవద్దని ఛైర్మన్లు, మేయర్లకు సూచించారు

దేశంలో ఆదర్శవంతమైన మున్సిపాలిటీలుగా తెలంగాణ పట్టణాలు మారడం ఖాయమని మంత్రి కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. ఇంతటి అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

'చట్టం చదువుకుని... రంగంలోకి దిగండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.