ETV Bharat / state

పంట నష్టపోయిన రైతులను పరామర్శించండి.. భరోసా ఇవ్వండి: కేటీఆర్ - ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్

KTR Tele Conference on Crop Damage: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించాలని మంత్రి కేటీఆర్ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.​ వ్యవసాయ అధికారులు, నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న కేటీఆర్‌.. రైతులకు భరోసా ఇచ్చేలా వారితో మమేకం కావాలని సూచించారు. ఈ మేరకు కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

KTR Tele Conference on Crop Damage
KTR Tele Conference on Crop Damage
author img

By

Published : Mar 20, 2023, 5:29 PM IST

KTR Tele Conference on Crop Damage: పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో తెలంగాణ ప్రగతిని వివరించడంతో పాటు మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, దేశ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను ప్రత్యేకంగా చర్చించాలని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకోవడం.. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా పెండింగ్​లో పెట్టి రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న తీరును ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని అన్నారు. పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్న పార్టీ ఇంఛార్జీలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో ఆయన దిల్లీ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అకాల వర్షాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలని.. నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. రైతు సోదరులకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి భరోసా ఇచ్చేలా, విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశంపైన దృష్టి సారించి వర్షాకాలంలోపు పనులు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలని అన్నారు.

గ్రామస్థాయిలో ఉపాధి హామీతో పాటు పంచాయతీరాజ్ శాఖ, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్న కేటీఆర్.. పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీకి సంబంధించిన రూ.1,300 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఇంకా పెండింగ్​లో ఉన్న నేపథ్యంలో బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని తెలిపారు.

వచ్చే నెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలన్న కేటీఆర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కార్యకర్తలకు ఇస్తున్న సందేశాన్ని అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలని తెలిపారు. ప్రతి కార్యకర్తకు ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండుసార్లు తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దోహదం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ సీఎం పంపే ప్రత్యేక సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలని పేర్కొన్నారు. ప్రతి 10 గ్రామాలకు నాలుగైదు డివిజన్లకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించిన మేరకు ముందుకు పోవాలన్న ఆయన.. ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ కార్యకర్తల ప్రాధాన్యత, వారితో ఉన్న అనుబంధాన్ని వివరించేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు.

దేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులపై కూడా విస్తృతంగా మాట్లాడుకోవాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు, కేంద్ర ప్రభుత్వ విధానాల వైఫల్యాలు వంటి వాటిని కార్యకర్తలకు అర్థమయ్యేలా చర్చించి, ప్రజా బాహుల్యంలోకి తీసుకువెళ్లేలా చూడాలని కేటీఆర్ తెలిపారు. మోదీ ప్రభుత్వం అటు దేశ ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను ప్రత్యేకంగా చర్చించాలని సూచించారు.

రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహిళా లోకానికి చేరేలా చూడాలని కేటీఆర్ అన్నారు. ఇంకా ఎక్కడైనా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ప్రారంభం కాకుంటే.. వెంటనే ప్రారంభం చేసుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకుంటే.. 25న నియోజకవర్గస్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించుకోబోతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీ జరుగుతుందన్న కేటీఆర్.. దీనికి పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని తెలిపారు.

ఇవీ చూడండి..

'పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాం.. రైతులను ఆదుకుంటాం'

మహిళల కోసం కొత్త ప్రభుత్వ పథకం.. నెలకు వెయ్యి రూపాయల భృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.