ETV Bharat / state

ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తాం: కేటీఆర్‌

న్యాయవాది దంపతులు వామన్ రావు, నాగమణి హత్యల వెనన ఎవరున్నా ఉపేక్షించేది లేదని.. కఠినంగా శిక్షిస్తామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం కృషి చేసి దేశంలో ఆదర్శంగా నిలుస్తామన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామక విధానంలో న్యాయవాదులకు అన్యాయం జరుతున్నట్లయితే సరిదిద్దుతామన్నారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రభుత్వ న్యాయవాదులను మార్చేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.

minister-ktr-said-those-involved-in-the-vamanrao-murder-case-will-be-severely-punished
ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తాం: కేటీఆర్‌
author img

By

Published : Mar 3, 2021, 3:57 AM IST

Updated : Mar 3, 2021, 7:00 AM IST

ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తాం: కేటీఆర్‌

తెరాస ప్రభుత్వం మొదటినుంచీ శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉందని.. అలాంటిది న్యాయవాదులను దారుణంగా చంపితే ఎందుకు ఉపేక్షిస్తామని మంత్రి కేటీఆర్​అన్నారు. హత్యలో తమ పార్టీ వ్యక్తి ఉన్నాడని పోలీసులు తేల్చగానే... పార్టీ నుంచి తీసేశామన్నారు. దంపతుల హత్యపై విచారణ వ్యక్తం చేసిన కేటీఆర్​.... నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ భవన్‌లో తెరాస లీగల్‌ సెల్‌ నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల సన్నాహాక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటుపై సీఎం, మంత్రి మండలితో చర్చిస్తానని కేటీఆర్​ హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.

10వేల కోట్లు ఇవ్వొచ్చు కదా

న్యాయవాదుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనైనా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్ల రూపాయల నిధి ఏర్పాటు చేశామని.. మోదీ సర్కారు కనీసం 10వేల కోట్లయినా ఇవ్వొచ్చు కదా అన్నారు.

పీఆర్​సీపై..

భాజపా అభ్యర్థి రాంచందర్‌ రావు ప్రశ్నించే గొంతుకే అయితే... ఐటీఐఆర్, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు తెరాసపై అసంతృప్తి ఉన్నట్లు... విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కొత్త పీఆర్​సీపై ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పట్టించుకోని పీవీ నర్సింహారావును .. తెరాస గౌరవిస్తోందన్నారు. శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు.

ఇదీ చూడండి : ఇన్​స్టాలో చాటింగ్​... పెళ్లి అనగానే చీటింగ్​

Last Updated : Mar 3, 2021, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.