ETV Bharat / state

Ktr Hmda Review: చెరువుల సంరక్షణపైన ప్రత్యేకమైన దృష్టి

Ktr Hmda Review: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... హెచ్​ఎండీఏ కార్యకలాపాలు, ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

Ktr
Ktr
author img

By

Published : Feb 19, 2022, 10:27 PM IST

Ktr Hmda Review: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే చెరువుల సంరక్షణపైన ప్రత్యేకమైన దృష్టి సారించి.. వాటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని అనేక చెరువులను వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నానక్​రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో హెచ్ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులపైన మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. చెరువుల సంరక్షణకు భవిష్యత్తు కాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కేటీఆర్ అన్నారు.

జీహెచ్ఎంసీతో...

హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ అనేక చెరువులను అభివృద్ధి చేస్తుందని.. జీహెచ్ఎంసీతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గండిపేట వంటి అతిపెద్ద చెరువుల వద్ద ఇప్పటికే అభివృద్ధి, సంరక్షణ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. గండిపేట సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా విస్తృతస్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని.. ఇది నగర ప్రజలకు ఒక అద్భుతమైన చోటుగా మారుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాపాడే చర్యలు...

హెచ్ఎండీఏ భౌగోళిక పరిధిలో భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్ఎండీఏ తన ఆస్తులను కట్టుదిట్టమైన భద్రతతో కాపాడే చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో రేడియల్ రోడ్ల బలోపేతం, మూసి ప్రక్షాళన, మూసిపై బ్రిడ్జిల నిర్మాణం, హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, లాజిస్టిక్ పార్కుల నిర్మాణం, రానున్న స్వల్ప భవిష్యత్ కాలానికి హెచ్ఎండీఏ ప్రణాళిక వంటి వివిధ అంశాలపైన సైతం మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

ఇదీ చదవండి : ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నా: గవర్నర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.