ETV Bharat / state

KTR on Swachh sarvekshan awards: 'ప్రభుత్వ చిత్తశుద్ధితోనే.. తెలంగాణ పురపాలికలకు అవార్డులు'

రాష్ట్ర పురపాలికలకు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్​ 2021 అవార్డులు.. ప్రభుత్వ కృషితోనే సాధ్యమైందని మంత్రి కేటీఆర్​(KTR on Swachh sarvekshan awards) అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రంలోని పట్టణాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం పట్ల పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవం అనంతరం కేటీఆర్​.. వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

swachh sarvekshan 2021, minister ktr
స్పచ్ఛ సర్వేక్షణ్​ 2021
author img

By

Published : Nov 21, 2021, 7:45 PM IST

రాష్ట్ర ప్రభుత్వ(KTR on Swachh sarvekshan awards)​ చిత్తశుద్ధితోనే తెలంగాణ పురపాలికలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్​- 2021లో భాగంగా జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్న పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్‌.. వారికి అభినందనలు తెలిపారు. వారి కృషిని అభినందించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్న అనంతరం.. దిల్లీలోని సీఎం కేసీఆర్​ నివాసంలో.. వారితో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

swachh sarvekshan 2021, minister ktr
స్పచ్ఛ సర్వేక్షణ్​ 2021

ఆదర్శంగా తీసుకోవాలి

తెలంగాణ(Swachh sarvekshan awards 2021 to telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అన్న భేదం లేకుండా సమగ్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం దూసుకుపోతోందని మంత్రి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణాలకు ప్రత్యేక నిధులు ఇవ్వడంతో పాటు అనేక కార్యక్రమాలను తీసుకొచ్చామని కేటీఆర్​ అన్నారు. అనేక వినూత్న కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ, కృషితోనే పట్టణాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా పట్టణ పరిపాలనలో ప్రధాన మంత్రి స్వనిధి వంటి అనేక కార్యక్రమాల్లోనూ జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

swachh survekshan 2021, minister ktr
తెలంగాణకు అందిన అవార్డులతో కేటీఆర్​

జాతీయ స్థాయిలో సఫాయి మిత్ర ద్వితీయ స్థానం అవార్డుతో పాటు మరో 11 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను దక్కించుకుందని మంత్రి వివరించారు. అవార్డులు దక్కించుకున్న పురపాలక సంఘాలను స్ఫూర్తిగా తీసుకొని ఇతర పట్టణాలు కూడా మరింత చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

swachh survekshan 2021, minister ktr
స్వచ్ఛ సర్వేక్షణ్​ జాతీయ అవార్డులతో కేటీఆర్​

ఇదీ చదవండి: రైతులకు గుడ్​న్యూస్- స్మార్ట్​ఫోన్​ కొనేందుకు ప్రభుత్వం సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.