ETV Bharat / state

దానికి ప్రధాన కారణం ఇన్నోవేషన్ లేకపోవడమే: కేటీఆర్ - ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ప్రారంభించిన కేటీఆర్

ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రోబోటిక్స్, లాంగ్వేజ్ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, సస్టైనబిలిటీ, స్మార్ట్ సిటీస్ వంటి రంగాల్లోని స్టార్టప్స్‌ రూపొందించిన ప్రయోగాలు, ఉత్పత్తులను పరిశీలించారు.

ktr
ktr
author img

By

Published : Jan 27, 2023, 10:39 PM IST

Updated : Jan 27, 2023, 10:46 PM IST

భారతదేశం... టెక్నాలజీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయినప్పటికీ దేశీయంగా అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులు రాకపోవడానికి ప్రధాన కారణం ఇన్నోవేషన్ లేకపోవడమేనని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేటీఆర్.. టెక్నాలజీ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, హైదరాబాద్ వంటి అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, లెక్చరర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అనంతరం రోబోటిక్స్, లాంగ్వేజ్ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, సస్టైనబిలిటీ, స్మార్ట్ సిటీస్ వంటి రంగాల్లోని స్టార్టప్స్‌ రూపొందించిన ప్రయోగాలు, ఉత్పత్తులను పరిశీలించారు. అత్యంత కీలకమైన వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను చూపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ కోసం ప్రయత్నించాలని తెలిపారు. అత్యంత సృజనాత్మకంగా, స్వతహాగా ఆలోచించాలని సూచించారు.

భారతదేశంలో ఇప్పటికీ పరిశోధన, అభివృద్ధి రంగాలపై ప్రభుత్వాలు తక్కువగా ఖర్చు చేస్తున్నాయన్న కేటీఆర్.. పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ లాంటి ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థులు పరిశోధనలు, ఆలోచనలను మరింత పదును పెట్టాలని కోరారు. పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా పాఠ్య ప్రణాళిక, విద్యా బోధన పద్ధతులను మార్చుకుంటే మరిన్ని మెరుగైన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న 50 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 2028 నాటికి వంద బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు.

''భారతదేశ యువకుల దగ్గర సమస్యల పరిష్కారానికి సంబంధించిన సామర్థ్యం అత్యద్భుతంగా ఉంది. వినూత్నమైన ఆవిష్కరణలను అన్ని రంగాల్లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు అంకురాల ప్రజెంటేషన్ విషయంలో ఔత్సాహిక యువత కొంత వెనకబడి ఉన్నారు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సరైన విధంగా పెట్టుబడిదారునికి చెప్పగలిగితే దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారు. అంతర్జాతీయ సంస్థలు సైతం భారతదేశ అంకురాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.'' - మంత్రి కేటీఆర్

ఇవీ చదవండి:

Last Updated : Jan 27, 2023, 10:46 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.