Minister KTR Dubai Tour 2023 : మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటనలో తొలిరోజే (మంగళవారం) రూ.1,040 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. అగ్నిమాపక పరికరాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో తెలంగాణలో రూ. 700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది. కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్.. మంత్రి కేటీఆర్(KTR at Dubai 2023)తో భేటీ అయ్యారు. 'నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్'తో కలిసి అంతర్జాతీయ స్థాయి 'ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ'ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ చేసిన ప్రతిపాదనకు సైతం ఆయన అంగీకరించారు. దాదాపు 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
-
🎉 Another exciting news from Dubai!
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Telangana has attracted a huge investment in the logistics and warehousing sector.
World's leading global trade enabler and port operator 'DP World' will invest Rs. 215 crores in Telangana to expand its operations.@DP_World's Executive… pic.twitter.com/HJF3EFEo5T
">🎉 Another exciting news from Dubai!
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 5, 2023
Telangana has attracted a huge investment in the logistics and warehousing sector.
World's leading global trade enabler and port operator 'DP World' will invest Rs. 215 crores in Telangana to expand its operations.@DP_World's Executive… pic.twitter.com/HJF3EFEo5T🎉 Another exciting news from Dubai!
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 5, 2023
Telangana has attracted a huge investment in the logistics and warehousing sector.
World's leading global trade enabler and port operator 'DP World' will invest Rs. 215 crores in Telangana to expand its operations.@DP_World's Executive… pic.twitter.com/HJF3EFEo5T
Minister KTR America Tour 2023 : తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడితో తమ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్ 'డీపీ వరల్డ్' తెలిపింది. డీపీ వరల్డ్ గ్రూప్(DP World Group) కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అనిల్ మెహతా, సంస్థ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ డైరెక్టర్ సాలుష్ శాస్త్రి తదితరులు మంగళవారం మంత్రి కేటీఆర్‌తో దుబాయ్‌లో భేటీ అయ్యారు. పోర్ట్ ఆపరేటర్‌గా ప్రపంచంలోనే అగ్ర భాగాన ఉన్న డీపీ వరల్డ్ హైదరాబాద్‌లో తమ 'ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో ఆపరేషన్' కోసం రూ.165 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ ప్రాంతంలో రూ.50 కోట్లతో 5000 ప్యాలెట్ కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ వేర్‌హౌస్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Corning Material Sciences Investments in Telangana : తెలంగాణలో మరో అగ్రగామి సంస్థ పెట్టుబడులు
-
🚀 LuLu Group Expanding Its Presence in Telangana
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A delegation of LuLu group, a renowned UAE-based company, met with the Industries Minister @KTRBRS in Dubai and discussed their thriving ventures in malls, food processing, and retail. 🏬🍲🛍️@Yusuffali_MA, Chairman Lulu Group… pic.twitter.com/AMnSCFYy4l
">🚀 LuLu Group Expanding Its Presence in Telangana
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 5, 2023
A delegation of LuLu group, a renowned UAE-based company, met with the Industries Minister @KTRBRS in Dubai and discussed their thriving ventures in malls, food processing, and retail. 🏬🍲🛍️@Yusuffali_MA, Chairman Lulu Group… pic.twitter.com/AMnSCFYy4l🚀 LuLu Group Expanding Its Presence in Telangana
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 5, 2023
A delegation of LuLu group, a renowned UAE-based company, met with the Industries Minister @KTRBRS in Dubai and discussed their thriving ventures in malls, food processing, and retail. 🏬🍲🛍️@Yusuffali_MA, Chairman Lulu Group… pic.twitter.com/AMnSCFYy4l
Dubai Companies Investments in Telangana : తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు లులూ గ్రూప్(LuLu Group Hyderabad) ఛైర్మన్ యూసుఫ్ అలీ ప్రకటించారు. కేటీఆర్‌తో ఆయన దుబాయ్‌లో సమావేశమయ్యారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో పాటు షాపింగ్ మాల్స్, రిటైల్ రంగంలో తమ సంస్థ కొనసాగిస్తున్న కార్యకలాపాలను మంత్రికి యూసుఫ్ అలీ వివరించారు. తమ సానుకూల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. కార్యకలాపాలను విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సిరిసిల్ల జిల్లాలో రానున్న ఆక్వా క్లస్టర్‌లో పెట్టుబడులు పెడతామన్నారు. అక్కడి నుంచి ఏటా రూ.1000 కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులను సేకరిస్తామన్నారు. ఇందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజీ, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌లను నెలకొల్పుతామన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో 500 మందికి నేరుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని యూసఫ్ వివరించారు.
-
🎉 Good News from Dubai Continues!
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🔹 Malabar Group has announced that it will invest another Rs 125 crore in Telangana, generating direct employment for 1000 people.
🔹The senior management team of Malabar Group met with the Industries Minister @KTRBRS in Dubai.
🔹 The… pic.twitter.com/d0XjimbcF2
">🎉 Good News from Dubai Continues!
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 5, 2023
🔹 Malabar Group has announced that it will invest another Rs 125 crore in Telangana, generating direct employment for 1000 people.
🔹The senior management team of Malabar Group met with the Industries Minister @KTRBRS in Dubai.
🔹 The… pic.twitter.com/d0XjimbcF2🎉 Good News from Dubai Continues!
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 5, 2023
🔹 Malabar Group has announced that it will invest another Rs 125 crore in Telangana, generating direct employment for 1000 people.
🔹The senior management team of Malabar Group met with the Industries Minister @KTRBRS in Dubai.
🔹 The… pic.twitter.com/d0XjimbcF2
US Companies Invests in Hyderabad : తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రకటించిన మలబార్ గ్రూప్.. ఇతర రంగాల్లోనూ తమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే బంగారం రిఫైనరీ రంగంలో తెలంగాణలో పెట్టుబడి పెట్టిన ఈ సంస్థ.. తాజాగా రూ.125 కోట్లతో ఫర్నీచర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మంగళవారం దుబాయ్‌లో మంత్రి కేటీఆర్‌తో మలబార్ గ్రూప్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ ఎంపీ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రితో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం అద్భుతంగా ఉందని ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మరో రూ.125 కోట్లతో ఫర్నీచర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీని వల్ల 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఆయనకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.