ఇళ్లలో పేరుకుపోయిన నీటిపై దోమలు వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని.. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా... సీజనల్ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు తమ ఇంటి పరిశుభ్రత, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కేటాయిస్తే వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులను అరికట్టే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ప్రగతిభవన్‌లో డ్రై డే కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. ప్రగతి భవన్ పరిసరాల్లో ఉన్న వర్షపు నీటిని తొలగించారు. రానున్న వర్షాకాలంలోవ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున... ఇందుకు ప్రధాన కారణమైన దోమలను అరికట్టాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య